MBNR: మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం తన నివాసంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణపయ్య ఆశీస్సులు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలపై ఉండాలని కాంక్షించారు. విజ్ఞాలను తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరుందని, అలాగే పేద ప్రజలందరికీ కోరికలు తీర్చాలని కోరినట్టు తెలిపారు.