TG: కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. రాజంపేటలో 31.9సె.మీల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్లో 20.8సె.మీల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో CM రేవంత్.. కామారెడ్డి, మెదక్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. NDRF, SDRF బృందాల సాయం తీసుకోవాలని CSకు సూచించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని MLAలను ఆదేశించారు.