KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులను కోరారు. వరద నీటితో నిండిన రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా, పాత, శిథిలావస్థలో ఉన్నఇళ్లలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.