ELR: ఆది గణపతి విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని ఏలూరు నగరంలోని స్థానిక పవర్పేట శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద కుటుంబ సమేతంగా వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.