GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ పాల్గొన్నారు.