BPT: కొరిశపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న కారు ఒకసారిగా యూటర్న్ తీసుకోవడంతో వెనకనుంచి వస్తున్న మరొక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి. హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.