GNTR: వినాయక చవితి పండుగ సందర్భంగా తెనాలిలోని మహా గణపతి తొలి పూజలను అందుకున్నారు. ఉదయం నుంచి 60 అడుగుల భారీ గణపతికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మహా గణపతిని దర్శించుకుని పూజలు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.