NLG: నల్గొండ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విఘ్నాలు తొలగి ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నానని తెలిపారు.