MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మంగళవారం, వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రంగారావు, పురోహితులు శివప్ప, నిర్వాహకులు వెంకటరెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి విశేష అలంకరణ, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయని వారు పేర్కొన్నారు.