MDK: మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షం బుధవారం ఉదయం వరకు కురుస్తూనే ఉంది. జిల్లాలో వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. అత్యధికంగా పెద్ద శంకరంపేటలో 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. టేక్మాల్ 201.0, రామాయంపేట 179.8, నార్సింగి 165.3, పాపన్నపేట 155.0, మెదక్ 134.3, కొల్చారం 129.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.