WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి రెండు ఎలక్ట్రికల్ ఆటోలు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగరాజు తెలిపారు. సీడీఎంఏ కమిషనర్ టీ.కే.శ్రీదేవి ఈ ఆటోలను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కొత్తపల్లితో పాటు వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీకి ఈ ఆటోలను కేటాయించారని కమిషనర్ పేర్కొన్నారు.