MDK: విద్యార్థులు చదువుతోపాటు క్రీడా పోటీలలో రాణించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ అన్నారు. పెద్ద శంకరంపేటలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో క్రీడ పోటీల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.