GDWL: న్యూహౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న బీజేపీ నేత అనిల్ కుమార్ భార్య సుధపై మంగళవారం నలుగురు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె తలకు బలమైన గాయం కాగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేతలు రామాంజనేయులు, స్నిగ్ధ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.