NRML: కుబీర్ మండల సరిహద్దులో ఉన్న ప్రసిద్ధిగాంచిన పాలజ్ కర్ర వినాయకుడు కొలువుదీరాడు. బుధవారం వేకువజామున బ్రహ్మముహూర్తంలో వేద పండితులు శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించి, స్వామివారిని ప్రతిష్ఠించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు ప్రత్యేక పూజలతో హారతులు నిర్వహించారు. మహారాష్ట్ర, తెలంగాణ నుంచి భక్తులు పాలజ్ గణేష్‌ను దర్శించుకొంటున్నారు.