VSP: విశాఖలోని 85వ వార్డు, లంకెలపాలెం గంజిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభం ప్రజలను భయపెడుతోంది. స్తంభం కింద భాగం పూర్తిగా శిథిలమై ఒకవైపుకి ఒరిగి ఉంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా, వారు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.