MBNR: బేకరీ వర్క్‌లో భాగంగా శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ..ఈ శిక్షణ ద్వారా తాము ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. అనంతరం వారు తయారు చేసిన వస్తువులను అధికారులకు పంచిపెట్టారు.