చిత్తూరుకు చెందిన వృద్ధురాలు తప్పిపోయి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉందని, ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య మంగళవారం తెలిపారు. ఈ మేరకు వృద్ధురాలిని చిత్తూరు కొంగారెడ్డిపల్లికి చెందిన సుబ్రమణి భార్య లక్ష్మీదేవిగా గుర్తించామన్నారు. కాగా, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో పోలీస్ అధికారులు గుర్తించి టూ టౌన్‌కు సమాచారం ఇచ్చారన్నారు.