BDK: దమ్మపేట మండలం మందలపల్లి పంచాయతీ వ్యాప్తంగా రోజురోజుకీ మట్టి అక్రమ దందా జోరుగా సాగుతోందని స్థానికులు మంగళవారం తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా ఎటువంటి అనుమతులు పొందకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కొందరు జేసీబీ ఓనర్లు అక్రమ మట్టి రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి నివారించాలని కోరారు.