కోనసీమ: అంబాజీపేట కొర్లపాటివారి పాలెంకు చెందిన మేడిద రంగజానకి(55) సోమవారం రాత్రి కొత్తపేట మండలం గొలకోటివారి పాలెం ప్రధాన పంట కాలువలో గల్లంతయ్యాడు. గల్లంతైన రంగజానకి మృతదేహం మంగళవారం అమలాపురం మండలం పాలగుమ్మి ప్రధాన పంట కాలువలో లభ్యమైంది. మృతుడు అంబాజీపేట ప్రభుత్వ ఆసుపత్రి ఛైర్మన్గా పని చేసారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.