మేడ్చల్: నగరంలో ప్లాస్టిక్, కాలుష్య రహిత సమాజం కోసం పాటుపడుతున్న ఏఎస్ఈజడ్డబ్ల్యూఏఓ స్వచ్ఛంద సంస్థ దక్షిణ కొరియా ప్రతినిధులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను పికెట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలసి సహకారం కోరారు. వారు చేస్తున్న సమాజ సేవకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.