AP: ఇరిగేషన్శాఖపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 80శాతానికి పైగా రిజర్వాయర్లు నిండాయన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 310 TMCలు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల ప్రవాహాలతో 1969 TMCలు సముద్రంలోకి చేరడంపై చర్చ నిర్వహించారు.