KDP: పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి, తెదేపా ఇంఛార్జ్ బి.టెక్ రవిలు కోరారు. ఈ మేరకు కడపలో సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను వారు కలిశారు. ఈ క్రమంలో కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించారు. అనంతరం త్రాగునీరు, రహదారుల అభివృద్ధి, మౌళిక వసతుల విస్తరణ, తదితర వాటి గురించి జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.