KMM: ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని సీపీఎం మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం తెలిపారు. సోమవారం ముదిగొండ మండల కేంద్రంలో మచ్చ వీరయ్య భవనం నుండి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.