CTR: పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప తెలిపారు. ఈ మేరకు కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పుంగనూరు పట్టణ దుకాణాల్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వారికి రూ.4,100 జరిమానా విధించారు.