CTR: తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న ముందస్తుగా గంగవరం కళామందిరంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు తులసీనాథం నాయుడు తెలిపారు. జాతీయస్థాయి వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. భాషాభిమానులు, సాహిత్యాభిమానులు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు హాజరై విజయవంతం చేయాలన్నారు.