WNP: యూరియా బస్తాలను పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ హెచ్చరించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడకుండా చూడాలని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో యూరియాను అందించాలని ఆయన సూచించారు.