KMR: బిచ్కుంద మండలం శెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సిబ్బంది నిర్ధారించారు.