ELR: కామవరపుకోట మండలంలో రైతులకు యూరియా లేదని ఎరువుల షాపులు యజమానులు అన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని మండల తహసీల్దార్ ఎలీషా తెలిపారు. మంగళవారం స్థానిక ఎరువుల షాపులలో యూరియా నిల్వలపై మండల వ్యవసాయ అధికారి ముత్యాలరావు, తడికలపూడి ఎస్సై చెన్నారావు ఆధ్వర్యంలో పరిశీలించారు. కృత్రిమంగా ఎరువులు కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.