JGL: ఉపాధి హామీ కూలీలందరూ తప్పనిసరిగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకానికి తమ అంగీకార సమ్మతిపత్రాన్ని అందజేసి ప్రమాదబీమా పొందాలని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. దాని ద్వారా పని ప్రదేశంలో, ఇతర ప్రమాదాల వల్ల బీమా తీసుకున్న అందరికీ ప్రయోజనం చేకూరుతున్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీల నుంచి డిక్లరేషన్ పత్రాలను బ్యాంకు అధికారులకు అందజేశారు.