AP: తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రయాణికులతో ఆచంట వెళ్తుండగా బట్టల మగుటూరు బస్టాండ్కి వచ్చే సమయానికి ఉన్నట్లుండి నిలిచిపోయింది. దాన్ని స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా మొరాయించింది. దీంతో మహిళలే బస్సును తోసి ముందుకు నడిపించారు.