RR: రాందేవ్ బాబా జన్మదినం సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీలోని రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో 300 మందితో శివరాంపల్లి వరకు ఈరోజు పాదయాత్ర చేపట్టారు. పలువురు మాట్లాడుతూ.. యాత్రను 18 ఏళ్ల నుండి కొనసాగిస్తున్నట్లు, యాత్రలో మార్వాడి సంఘమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కలిసి పాల్గొంటారన్నారు. DJ ఆటపాటలతో బాబారాందేవ్ భక్తులు పాదయాత్రగా తరలివెళ్లారు.