W.G: అధికారులు. రేషన్ డీలర్లు ప్రజలు మన్ననలు పొందేలా పనిచేయాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు గ్రామాలలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత, ఇబ్బందులు తొలగించేందుకుగాను అధునాతన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిందని అన్నారు.