TG: ఖైరతాబాద్ మహా గణపతి సిద్ధమైంది. విగ్రహానికి చివరి అంకమైన కన్ను దిద్దడం నేడు పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. ఈ సందర్భంగా బడా గణేశ్ ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్‌తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.