NLR: కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ ఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ సోమవారం తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్, పూర్తి చేసిన వారు అర్హులు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయని, ఆసక్తిగల యువతీ యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.