పాత కుక్కర్లను వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. పాత కుక్కర్లలోని లోహాలు ఆహారంలోకి సీసాన్ని విడుదల చేస్తాయి. ఇది మెదడు, మూత్రపిండాలు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గీతలు పడిన, రీసైకిల్డ్ లోహంతో చేసిన కుక్కర్లను వెంటనే వాడటం మానేయాలి. సురక్షితమైనవిగా భావించే స్టీల్, అయొనైజ్డ్ అల్యూమినియం కుక్కర్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.