KMR: జిల్లాలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో అలర్ట్ జారీ చేస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ఇటీవల శెట్లూర్ వద్ద మంజీరాలో గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. తాజాగా ముగ్ధుంపూర్ వద్ద మంజీరాలో మేకల కాపర్లు చిక్కుకున్నారు. దీంతో తాము ఇబ్బందుల్లో పడటమే కాకుండా యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.