అన్నమయ్య: చిట్వేలిలోని క్రేజీ యూత్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు స్థానిక స్టేట్ బ్యాంకు వద్ద నెలకొల్పిన బొజ్జ గణపయ్యకు వేదపండితులు సుబ్రహ్మణ్యం శర్మ విశేష పూజలు నిర్వహించారు. కాగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.