అన్నమయ్య: పీలేరు పట్టణంలోని బీడి రెడ్డి కాలనీ సెంటర్ వద్ద బుధవారం వినాయక చవితి వేడుకల సమయంలో అపశృతి చోటుచేసుకుంది. గడచిన రాత్రి కురిసిన వర్షం కారణంగా మండపంలో ఏర్పాటు చేసిన హారాలు, అలంకరణ సామగ్రి తడిసి మంటలు చెలరేగాయి. దీంతో మండపంలోని కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.