NLG: మునుగోడు మండలం చొల్లేడుకు చెందిన నారగోని సైదులు సోమవారం డాక్టరేట్ పట్టా పొందారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ‘ముకుంద రామారావు సాహిత్యం’ అనే అంశంపై ఆయన PhD పూర్తిచేశారు. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుని ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.