ADB: పట్టణంలో మంగళవారం వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేయగా.. దుకాణాల వద్ద మండపాల నిర్వాహకుల సందడి నెలకొంది. ఈ క్రమంలో సామజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.