NRML: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఇటీవల ఉట్నూర్ మండలంలోని రాజులమడుగులో అడవి పంది దాడిలో మృతి చెందిన కొడప లక్ష్మణ్ కుటుంబానికి ప్రభుత్వం, అటవీ శాఖ మంజూరు చేసిన రూ. 10 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో అరుణ, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.