W.G: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం నిలబడే నాయకుడని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం కాళీపట్నం తూర్పు గ్రామంలో స్థానిక నాయకుడు బాలం దాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నాయకర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.