VSP: జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పీ. నారాయణ మంగళవారం సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమీక్షకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో పాటు, సీడీఎంఏ డాక్టర్ పీ. సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ప్రభాకర్, జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పల్లంరాజు పాల్గొన్నారు.