AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,50,746 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1,97,605 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగుల వద్ద ఉంది.