MHBD: మరిపెడ మండల కేంద్రంలోని మైనార్టీ కాలనీలో వర్షం పడితే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. 30 ఏళ్లుగా మట్టి రోడ్లు, సైడ్ కాలువలు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టూ వీలర్స్, ఆటోలు బురదలో కూరుకుపోతున్నాయని, నడిచే పరిస్థితి కూడా లేదని మంగళవారం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని అధికారులను కోరారు.