జమ్మూకశ్మీర్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనలో 30 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.