HYD: మహానగర వ్యాప్తంగా భారీ వర్షం కురవటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు బురద మయంగా మారాయి. రహదారులపై నీరు నిల్వ ఉండడంతో పాటు, బురద ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. వర్షంలో సామాన్లతో నడుస్తున్న వారు జారిపడి ప్రమాదానికి గురవుతున్నారు. చుట్టూరా డ్రైనేజీ సమస్యలు సైతం ఇందుకు కారణంగా అక్కడి ప్రజలు తెలిపారు.