AP: తెలుగుదేశం పార్టీ కమిటీల గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్ర కమిటీ ఉంటుందని, జిల్లాల కమిటీలపై కూడా త్వరలో ప్రకటన చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త కమిటీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.