‘బాహుబలి:ది ఎపిక్’ మూవీపై దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్ అని తెలిపారు. ‘బాహుబలి 1, 2’ కలిపి 5:27 నిమిషాల నిడివి ఉన్నాయని, నిడివి తగ్గించడానికి కొన్ని సన్నివేశాలు తొలగించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘కన్నా నిదురించరా’ పాటతో పాటు ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కట్ చేసినట్లు చెప్పారు.