HYD: నాలాలో ఒకటి రెండు అడుగుల పూడిక సహజమే. కానీ.. కృష్ణానగర్లో 8 అడుగుల లోతైన నాలాలో 6 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. రెండు మీటర్ల పూడిక తీయగానే 7, 8 ట్రాక్టర్లు నిండుతున్నాయి. 8 అడుగుల లోతు, ఆరడుగుల మేర పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కమిషనర్ రంగనాథ్ సైతం పరిశీలించినట్లు వివరించారు.